Rajinikanth Birthday: ఢిల్లీలో పార్టీ పనుల్లో బిజీగా రజినీకాంత్
New Delhi, December 12: నేడు బర్త్ డే జరుపుకుంటున్న రజనీకాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు (Rajinikanth Turns 70) తెలిపారు. ప్రియమైన రజనీ కాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండాలి’ అని ట్వీట్ (PM Narendra Modi Wishes the Superstar on His Birthday) చేశారు. రజనీకాంత్ గత ఆగస్టులో 45 ఏండ్ల తన సినీ జీవితాన్ని పూర్తిచేసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని డిసెంబర్ 4న ప్రకటించారు. తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ఈనెల చివర్లో ప్రకటిస్తామని తెలిపారు.
ఇక రాజకీయాల్లోకి రావడం ఖాయమని రజనీకాంత్ 2017 డిసెంబర్‌లోనే చెప్పగా.. ఈ డిసెంబర్ 31న పార్టీ స్థాపనపై కీలక ప్రకటన చేస్తానని ఇటీవల స్పష్టం చేశారు. రజనీ దూకుడును చూస్తుంటే వచ్చే ఏడాది జనవరిలో పార్టీ స్థాపన, ఏప్రిల్ లేదా మేలో వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఖాయమని తెలుస్తోంది. పార్టీ స్థాపనపై మక్కల్ మన్రం నిర్వాహకులతో రజనీకాంత్ చెన్నైలోని తన ఇంటి వద్ద శుక్రవారం మరోసారి సమాలోచనలు జరిపారు.
ప్రధాన సమన్వయకర్త అర్జున్‌మూర్తి, పర్యవేక్షకులు తమిళరువి మణియన్, మక్కల్ మన్రం రాష్ట్ర నిర్వాహకులు సుధాకర్, మన్రం మాజీ అధ్యక్షులు సత్యనారాయణన్ పాల్గొన్నారు. పార్టీ పేరును రిజిస్టర్ చేయడంలో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద మక్కల్ మన్రం అగ్రనేతలు శుక్రవారం బిజీబిజీగా గడుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీ పేరు, పతాకం, చిహ్నంపై రజనీకాంత్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మూడు పేర్లను సీఈసీ వద్ద నమోదు చేస్తే అందులో ఏదో ఒకదాన్ని అధికారులు ఆమోదిస్తారు. ఈ ప్రక్రియ నెలాఖరుకు పూర్తయితే 31న పార్టీ పేరును రజనీ అధికారికంగా ప్రకటిస్తారని అంచనాలు వెలువడుతున్నాయి.
ఇక రజనీకాంత్ పార్టీప పలువురు నేతలు అప్పుడే విమర్శలు ఎక్కుపెట్టారు. పార్టీని స్థాపించి సినిమా షూటింగులకు వెళ్లే ఒకే ఒక రాజకీయనేత దేశమొత్తం మీద రజనీకాంత్ మాత్రమేనని అంటూ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఎద్దేవా చేశారు. పార్టీ రాజకీయాలను ఎవరైనా ఎంతో సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాక్షేత్రంలోకి దిగి పాటుపడాల్సి ఉంటుంది. అయితే పార్టీని స్థాపించిన తరువాత “అన్నాత్త’ అనే చిత్రం షూటింగ్ కోసం 40 రోజులపాటు రజనీ వెళ్లిపోతున్నట్లు వెలువడిన సమాచారం విచిత్రంగా ఉందని ఆమె అన్నారు.