వైకాపా ఎమ్మెల్యే వినూత్న నిరసన

Wednesday, December 5, 2018 04:31 PM News
వైకాపా ఎమ్మెల్యే వినూత్న నిరసన

నెల్లూరు రూరల్ వైకాపా ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి విన్నూత్న నిరసన చేపట్టి అధికారులకు చెమటలు పట్టించారు. ప్రజా సమస్యలను తీర్చేందుకు ఎప్పుడూ ముందుండే కోటం శ్రీధర్ రెడ్డి ఈ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏకంగా నడుము లోతు వరకు మురికి కాలువలో నిలబడి నిరసన చేపట్టారు.

వివరాల్లోకి వెళితే కోటం శ్రీధర్ రెడ్డి నియోజకవర్గం పరిధిలో ఓ మురికి కాలువపై వంతెన నిర్మించాల్సిన అవసరం ఉంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు వంతెన కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు. అయితే, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడే ఎమ్మెల్యే కోటం దృష్టికి వచ్చింది. ఈ సమస్యపై కోటం జోక్యం చేసుకున్నా కూడా అధికారుల్లో చలనం రాకపోయేసరికి నేడు హఠాత్తుగా మురికి కాల్వలోకి దిగి చేతులు కట్టుకుని నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు వెంటనే ఎమ్మెల్యే వద్దకు వచ్చి మురికి కాలువపై వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. సమస్యలు పోరాడేందుకు హామీలు ఇచ్చే ఎమ్మెల్యేలను ఎంతో మందిని చూసుంటాం, కానీ ఇలాంటి నాయకులు చాలా అరుదని స్థానికులు కొనియాడారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!