క్యాస్టింగ్ కౌచ్ స్టోరీలు : గెస్ట్ హౌస్ కు రమ్మనేవారు
Thursday, March 12, 2020 02:28 PM Entertainment
ఆమని కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు.ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాల గురించి వివరించారు. స్వయంగా తాను కూడా ఇబ్బందులకు గురయ్యానన్నారు. సినిమా గురించి మాట్లాడేందుకు సంప్రదించిన కొందరు అంతా ఓకె అనుకున్న తరువాత గెస్ట్‌హౌస్‌కు రమ్మనే వారని తెలిపారు.ప్రత్యేకంగా మీ అమ్మను వెంట తీసుకురాకు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. వాళ్ల మాటలను బట్టే అంతా అర్ధమయ్యేదని అందుకే అలాంటి వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించానని తెలిపారు.
For All Tech Queries Please Click Here..!