ఏప్రిల్ 7 కి కరోనాని తరిమి పారేస్తాం.!
ఇప్పటివరకు తెలంగాణలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాకి తెలిపారు. ఇప్పటి వరకు పాజిటివ్‌గా ఉన్న 11 కేసులు కోలుకున్నారని, వారికి పరీక్షలలో నెగిటివ్ వచ్చిందని చెప్పారు. మరోసారి పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. మిగితా పాజిటివ్ కేసుల వ్యక్తులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,937 మంది పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. భారతదేశం చేస్తున్న లాక్‌డౌన్‌ను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని, మనలని స్ఫూర్తిగా తీసుకుంటున్నాయని కేసీఆర్ తెలిపారు. మన దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌనే ఏకైక ఆయుధమని అన్నారు.
ఏప్రిల్ 7లోగా కరోనా ఫ్రీ తెలంగాణ అవుతుందని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం కరోనా అంతా కంట్రోల్ లోనే ఉందన్నారు. కొద్ది రోజుల్లో వారి క్వారంటైన్ టైమ్ కూడా ముగుస్తుందన్నారు. అంతా తొందరగా కరోనా నుంచి బయటపడాలని కోరుకుంటున్నానని చెప్పారు.