గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్లలోకి పోనివ్వడం లేదు.. లబ్ధిదారుల ఆవేదన....

Friday, October 13, 2023 09:45 AM News
గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్లలోకి పోనివ్వడం లేదు.. లబ్ధిదారుల ఆవేదన....

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ లబ్ధిదారుల పరిస్థితి గందరగోళంగా మారింది. లబ్ధిదారులకు ఇల్లు పత్రాలు ఇచ్చినా వారు ఇళ్లలోకి వెళ్లలేకపోతున్నారు. అధికారులు లబ్ధిదారులకు ఇంకా తాళాలు ఇవ్వలేదు. తాళాలు ఇవ్వాలని కోరినా తమకు పై నుంచి తాళాలు ఇవ్వొద్దని ఆదేశాలు ఉన్నట్లు వారు చెబుతున్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందిస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 70 వేల ఇళ్లను మాత్రమే అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ 70 వేల ఇళ్ల కనీ సౌకర్యాలు లేవని ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఒక కొల్లూరులో 15, 660 ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్లలో ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇళ్లలోకి లబ్ధిదారులకు అనుమతి ఇస్తాలేనట్లు సమాచారం. పట్టాలిచ్చారని సంతోషపడుతున్న లబ్ధిదారులను ఇండ్లలోకి రానివ్వకపోవడంతో తమ సొంతింట్లోకి ఇంకెప్పుడు వెళ్తామోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: