ఆ మ్యాచే నాకు ఓ చేదు జ్ఞాపకం

Wednesday, August 7, 2019 12:46 PM Sports
ఆ మ్యాచే నాకు ఓ చేదు జ్ఞాపకం

2003 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్ గురించి పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ఓ ఆసక్తికర విషయం చెప్పారు. 2003 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచే తన కెరీర్‌లో అత్యంత చెత్త మ్యాచ్‌గా, ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిందని అక్తర్‌ పేర్కొన్నాడు.అక్తర్ తన యూట్యూబ్‌ చానెల్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. వీడియోలో అక్తర్ మాట్లాడుతూ సెంచూరియన్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మేము 274 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోలేకపోయాం. నా కెరీర్‌లో తీవ్రమైన నిరాశకు గురి చేసిన మ్యాచ్‌ అది. గట్టి బౌలింగ్ టీం ఉన్నా మేము ఏం చేయలేకపోయాం. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి ఎడమ మోకాలికి 5 ఇంజెక్షన్లు తీసుకోవలసి వచ్చింది. అయినా బౌలింగ్ చేసాను. అయితే మంచి ప్రదర్శన మాత్రం చేయలేదు అని అక్తర్ తెలిపాడు.

మా ఇన్నింగ్స్ ముగిసిన తరువాత బహుశా ఇంకో 40 పరుగులు సాదించాలసంది అని సహచరులకు చెప్పాను. దీంతో జట్టులోని ఆటగాళ్లందరూ 273 సరిపోదా? అని నాపై గట్టిగా అరిచారు. పాక్ టీంకి టీమిండియాను ఆలౌట్ చేసే సత్తా ఉందన్నారు. అది బ్యాటింగ్‌ పిచ్‌ కావడంతో ఆ పరుగులు సరిపోవని నాకు అర్థమైంది. తర్వాత అదే నిజమైంది. భారత ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ మంచి ఆరంభం ఇచ్చారు. ఆ మ్యాచ్‌ నాకు ఒక చేదు జ్ఞాపకం అని అక్తర్‌ పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన పాక్ 273 పరుగులు చేసింది. ఓపెనర్ సయీద్ అన్వర్ సెంచరీ (101) చేసాడు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ నాలుగు ఓవర్లు ఉండగానే విజయం సాధించింది. సచిన్‌ టెండూల్కర్‌ 98 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువరాజ్ (50) తో రాణించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: