మోడీ స్పెషల్ గిఫ్ట్ అందుకున్నది ఎవరు ?
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. దీంతో ఇన్నేళ్లూ కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదా ఇక పూర్తిగా రద్దు అయింది. మరి ప్రధాని మోడీ దీన్ని ఎవరికి కానుకగా అందించారు. ఎవరు దీనికోసం ఆదినుంచి పోరాడి ఆ కోరిక తీరకుండానే మరణించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఏంటి.. భారత దేశంలో నివసించడానికి ఒక రాష్ట్ర ప్రజలకు ఆ దేశానికి సంబంధించిన అర్హత లేకపోవడం ఏంటి? ఆ రాష్ట్రంలో గుర్తింపు కార్డు చూపించాల్సి రావడం ఏంటి? అని 1953లో కాశ్మీర్‌కు వెళ్ళి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించి, ఆ రాష్ట్ర సరిహద్దు వద్ద అరెస్టయి ఆ కలను కలగానే మిగల్చుకున్న వారు ఎవరు ? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో చూద్దాం.