విద్యుత్ కొనుగోళ్లు - చెల్లింపుల‌పై వాస్త‌వాలివీ

Saturday, May 16, 2020 08:00 PM News
విద్యుత్ కొనుగోళ్లు - చెల్లింపుల‌పై వాస్త‌వాలివీ

1. 2014లో యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు ధర రూ.4.33 కాగా 2019 నాటికి బాబు ప్రభుత్వం దీనిని రూ.6.07 కి తీసుకెళ్లింది.
(ఇప్పుడు వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు ధరను రూ.5.66 కి తగ్గించింది.)

2. (తాత్కాలికంగా ఎక్సేంజ్ నుంచి కొనే విద్యుత్‌.) 2018 అక్టోబర్‌లో గత  టీడీపీ  ప్రభుత్వం యూనిట్‌ విద్యుత్‌ను రూ.6.75కి కొనుగోలు చేస్తే జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2019 అక్టోబర్‌లో యూనిట్‌ విద్యుత్‌ను రూ.3.41 చొప్పున కొనుగోలు చేసింది.
విద్యుత్‌ కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించింది వైయ‌స్‌ జగన్ ప్రభుత్వం

3. గత టీడీపీ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు బకాయిలను రూ.5,000 కోట్ల నుంచి రూ.19,400 కోట్లకు పెంచి దిగిపోయింది.
(ఇందులో జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.5,000 కోట్లను చెల్లించింది. )

4. ఇక డిస్కమ్‌లకు సబ్సిడీలను ఇవ్వకుండా గత ప్రభుత్వం రూ.11వేల కోట్లు బకాయిలను మిగిల్చింది.
(జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.7,000 కోట్ల మేర సబ్సిడీలను చెల్లించింది),

5. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అప్పులను టీడీపీ సర్కారు రూ.31,650 కోట్ల నుంచి రూ.63,500 కోట్లకు పెంచింది.

6. మరోవైపు విద్యుత్‌ సంస్థల నష్టాలు 2015లో రూ.7,000 కోట్లు కాగా టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.30 వేల కోట్లకు ఎగబాకాయి.

ఈ గణాంకాలను పరిశీలిస్తే చంద్ర‌బాబు పాలన ఎంత ఘోరంగా ఉందొ ఆయ‌న ఎలా దోచుకున్నాడో అర్థం అవుతుంది.

For All Tech Queries Please Click Here..!
Topics: