ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది, Live Updates

Sunday, March 10, 2019 07:21 PM News
ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది, Live Updates

సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా తొమ్మిది విడతల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నారు సునీల్ అరోరా.

అన్ని స్టేట్స్ లో కావాల్సిన ఆరెంజిమెంట్స్ చేసాం అని తాము ఎన్నికలకు సిద్ధం గ ఉన్నాం అని తెలిపారు, ఎన్నికల కమిషన్ ఈ కింది వివరాలు తెలిపింది,

  • మొత్తం 90 కోట్ల ఓటర్లు.
  • 18 - 19 ఇయర్స్ మధ్య ఓటర్లు 1.5 కోట్లు. 
  • 2014 నుండి ఇప్పటివరకు కొత్త ఓట్లు 8.5 కోట్లు. 
  • మొత్తం 10 లక్షల పోలింగ్ కేంద్రాలు. 
  • 2014 తో పోలిస్తే లక్ష పోలింగ్ కేంద్రాలు. 
  • అన్ని చోట్ల VV ఫ్యాట్ ఏర్పాటు.  
  • మొత్తం 7 విడతలాగ ఎలక్షన్ జరుగుతుంది. 
  • నామినేషన్ వేయాలంటే అభ్యర్థులు పాన్ కార్డు ఇవ్వాల్సిందే. 
  • అభ్యర్థులు ఫారం 26 తప్పకుండ ఇవ్వాలి. 
  • రైతులకు ఇబ్బంది లేకుండా ఈ షెడ్యూల్ ఉంటుంది.
  • రాత్రి 10 నుంచి మార్నింగ్ 6 వరకు లౌడ్ స్పీకర్స్ నిషేధం.
  • ఎగ్జామ్స్, పండగ తేదీలను పరిగణలోకి.
  • సోషల్ మీడియా లో ప్రచారాల పై కన్ను.
  • ఈవీఎం ల పైన అభ్యర్థుల ఫోటోలు ఉంటాయి.
  • ఓటర్ కార్డు తో పాటు 11 ఐడెంటిటీ కార్డ్స్ అనుమతిస్తాం.
  • 5 రోజుల ముందు పోలింగ్ స్లిప్స్ ఇస్తారు.
  • ఏప్రిల్  11 న తోలి విడత పోలింగ్.
  • మే 23 న ఎన్నికల ఫలితాలు.
  • AP,Telangana ఒకే విడతలో జరుగుతుంది.
  • AP,Telangana లో ఏప్రిల్  11 న పోలింగ్ 

alt text

For All Tech Queries Please Click Here..!