#RamarajuForBheem: ఆర్ఆర్ఆర్ లో దుమ్మురేపిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, రోమాలు నిక్కబొడిచేలా టీజర్ డైలాగ్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్- రౌద్రం రణం రుధిరం' (RRR: Roudram Ranam Rudhiram) సినిమా నుంచి మరొక ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈరోజు స్వాతంత్య్రోద్యమ వీరుడు, తెలంగాణ గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ జయంతిని పురస్కరించుకొని, ఈ సినిమాలో 'భీమ్' పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురమ్ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటన్నింటికి ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
#RamarajuForBheem: వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్, నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయ్, వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకటిని చీల్చే మొండి బండ, వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ, నా తమ్ముడు గోండు బెబ్బులి కొమరం పులి..
ఈ క్రమంలో తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి సంబంధించి రామ్‌చరణ్ ఎన్టీఆర్‌కు రిటర్న్ గిప్ట్ ఇచ్చారు. నేడు కొమురం భీం జయంతి సందర్భంగా రామరాజు వాయిస్‌కు సంబంధించిన ఎన్టీఆర్ టీజర్‌ని చరణ్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ యాక్షన్స్‌కి రామ్ చరణ్ వాయిస్ ఇచ్చారు. భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ, గోండు బెబ్బులి కొమరం భీమ్' వచ్చేశాడు! రామ్ చరణ్ గంభీరమైన గళంతో ఫస్ట్ టీజర్ విడుదల చేశారు.
కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న అభిమానుల అంచనాలకు తగ్గకుండా అంతే రీతిలో భీమ్‌గా ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఇక రామరాజుకు రామ్ చరణ్ ఇచ్చిన మెగా పవర్‌ఫుల్ వాయిస్ గంభీరంగా, అద్భుతంగా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భీమ్ టీజర్ లాగే ఈ టీజర్ కూడా సంచలనం సృష్టిస్తుందని సంబరపడిపోతున్నారు.
కాగా భీమ్ ఫర్ రామరాజు అనే టీజర్‌ను రామ్ చరణ్ బర్త్డే రోజున విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో చరణ్‌కు ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ పుట్టినరోజుకు మత్రం ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో ఎన్టార్ పాత్ర కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. ప్రస్తుతం రామరాజు ఫార్ భీమ్ పేరుతో రామరాజు టీజర్ విడుదల అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.