ఒక్క రాత్రికి వస్తే... కోటి ఇస్తా అంటున్నారు: సాక్షి చౌదరి
జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా,పోటుగాడు. ఈ చిత్రాలు ప్రేక్షకులకు పెద్దగా గుర్తుండకపోవచ్చు కాని. ఆ చిత్రంలో నటించిన అందాల తార సాక్షి చౌదరి మాత్రం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.సినిమాలు హిట్ కాకపోయినా సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతూ గ్లామర్ నటిగా పాపులర్ అయ్యారు సాక్షి చౌదరి. అయితే హాట్ సుందరి అందాలను చూసి తరించాలి కాని, అంతకు మించి ఎక్కువ ఆశపడితే బాగోదంటూ వార్నింగ్ ఇస్తుంది సాక్షి.
నటిగా అన్ని పాత్రలలో ఆకట్టుకోవడం, ప్రేక్షకుల్ని ఉత్సాహపరచడమే నా పని. అయితే కాస్త హాట్ గా వీడియో తీసిన చూసి ఆనందించండి. ఇప్పటికే నా వీడియోలు చూసి జనం పిచ్చెక్కిపోతున్నారు. ఆ ఆనందాన్ని ఆపుకోలేక చాలా మంది నాకు రేటు కడుతున్నారు. కొంతమంది అయితే. ఒక రాత్రికి వస్తే.. ఏకంగా కోటి రూపాయలు ఇస్తా అంటూ ఆఫర్ కూడా ఇస్తున్నారు. రాత్రికి వస్తావా? రేటు ఎంత? అంటూ వేధిస్తున్నారు అని సాక్షి చౌదరి వాపోయారు.
నటి అయినంత మాత్రాన అంత చులకనగా చూడాల్సిన అవసరం లేదు. నాకు ఆఫర్స్ ఇచ్చే వాళ్లు పెద్ద మూర్ఖులు అని. ఇంకోసారి ఇలా చేస్తే వాళ్ల బండారం బయటపెడతా’ అంటూ కోటి ఆఫర్ చేసిన కొవ్వెక్కిన వాళ్లకి గట్టివార్నింగ్ ఇస్తుంది సాక్షి చౌదరి.