kajal aggarwal marriage photos: ముంబైలో ఘనంగా కాజల్ అగర్వాల్ పెళ్లి...అనుకోకుండా షాకింగ్ ఘటన...పెళ్లి తంతు మధ్యలోనే...
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహం వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఈ సాయంత్రం ముంబయిలో జరిగింది. ఈ సెలబ్రిటీ పెళ్లికి నగరంలోని తాజ్ ప్యాలెస్ స్టార్ హోటల్ వేదికగా నిలిచింది. సంప్రయదాయ పెళ్లి దుస్తుల్లో కాజల్, గౌతమ్ కిచ్లూ వివాహ మంటపంలో కనువిందు చేశారు. ముఖ్యంగా, కాజల్ పెళ్లికూతురు డ్రెస్సులో మెరిసిపోయింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో కాజల్ వివాహం జరిగింది. అంతకుముందు, కాజల్ తన తల్లి సుమన్ అగర్వాల్ తో కలిసి తన నివాసం నుంచి తాజ్ ప్యాలెస్ కు వెళ్లే క్రమంలో ఎంతో హుషారుగా మీడియాకు అభివాదం చేశారు. అంతేకాదు, కొందరు అభిమానులను కూడా ఆమె విష్ చేశారు. ఇదిలా ఉంటే కాజల్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ‘లక్ష్మి కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన అందాల తార కాజల్ ‘మగధీర’ చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి హిట్‌ను అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’, కమల్‌హాసన్‌తో ‘ఇండియన్–2’, మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’ సినిమాల్లో నటిస్తోంది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని కాజల్ తాజాగా చెప్పింది.
ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన కాజల్...
తన వివాహంపై కాజల్ అగర్వాల్ అభిమానులకు వివరించింది. తమ పెళ్లిలో తెలుగు సంప్రదాయాన్ని కూడా పాటించామని చెప్పింది. తమ వివాహం సందర్భంగా జీలకర్ర-బెల్లం కూడా తలపై పెట్టుకున్నామని వివరించింది. ఓ పంజాబీ వచ్చి ఓ కశ్మీరీని వివాహం చేసుకుంది. అయితే గౌతమ్ కు, నాకు దక్షిణ భారతదేశంతో ఎంతో అనుబంధం ఉంది. తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో జీలకర్ర-బెల్లం చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ ప్రక్రియ ద్వారానే వధూవరులు ఒక్కటవుతారు. జీలకర్ర,బెల్లాన్ని ముద్దలా చేసి తమలపాకుపై ఉంచి ముహూర్త సమయానికి వేదమంత్రాల నడుమ ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటారు. ఆ తర్వాతే పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఒకరిని ఒకరు చూసుకుంటారు. కష్టసుఖాల్లోనూ కలిసి ఉంటారని చెప్పేందుకు ఈ తంతు" అంటూ కాజల్ తెలిపారు.ఇన్ని సినిమాల్లో నటించినా తెలుగు మాట్లాడటం నేర్చుకోని కాజల్....తెలుగు సాంప్రదాయం మాత్రం మరిచిపోకుండా పాటించడం పట్ల అంతా షాక్ లో ఉన్నారు.