బ్రేకింగ్: గోదావరి నదిలో పడి డైరెక్టర్, కెమేరామెన్ మృతి
ఇప్పుడు బాగా సక్సెస్ ఉన్న దర్శకులు చాలా తక్కువ, బాగా సక్సెస్ రేటు ఉన్న డైరెక్టర్స్ కి కూడా ఇప్పుడు ఛాన్సెస్ రావటం తాగింది, ఛాన్సులు రాకుండా ఎంతో టాలెంట్ ఉన్న యువ డైరెక్టర్స్ కూడా ఇండస్ట్రీలో కోకొల్లుగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొందరు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తమ టాలెంట్ నిరూపించుకుని సినిమాల్లో ఛాన్సు కొట్టడం కోసం కష్టాలు పడుతున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి కూడా నిర్మాతల కోసం వారు పడని పాట్లు లేవు. ఇలా తన ప్రతిభను నిరూపించుకుంటోన్న ఓ యంగ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గోదావరి ఊబిలో చిక్కుకుని, తన తోటి కెమేరామెన్తో సహా గల్లంతైన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.
వివరాలలోకి వెళితే సినిమాల్లో డైరెక్టర్ ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేస్తోన్నషార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సుధీర్ (33), అతడి స్నేహితుడు కెమేరామెన్ కార్తీక్ (35) షార్ట్ ఫిల్మ్ లొకేషన్ కోసం కోనసీమకు వెళ్లారు. అక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక పరిసరాల్లో గోదావరిలో స్నానానికి దిగారు. వీరు స్నానం చేస్తూ ఊబిలో కూరుకుపోయి మృతి చెందారు.