శేఖర్ మాస్టర్ నిజ స్వరూపం అదే, హీరోయిన్ కామెంట్స్

Saturday, July 18, 2020 11:40 AM Entertainment
శేఖర్ మాస్టర్ నిజ స్వరూపం అదే, హీరోయిన్ కామెంట్స్

మనసిచ్చాను సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మణి చందన. పెళ్లి అనంతరం సినిమా రంగానికి దూరమైంది. అయితే మళ్లీ ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సైడ్ క్యారెక్టర్స్ చేస్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో తన సినీ కెరీర్ గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. అందులో భాగంగా శేఖర్ మాస్టర్ వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలను బయట పెట్టింది.

తొలిప్రేమ సినిమాలో మొదటగా ఓ చిన్న పాత్రలో చేశానని చెప్పుకొచ్చింది. అలా ఉండగా ఓ రోజులో సెట్‌లో చిరంజీవి తనను చూసి హీరోయిన్ అవుతావని జోష్యం చెప్పారట. అంతేకాకుండా చిరు వద్ద ఉండే ఫోటోగ్రాఫర్‌తో ఫోటోలు కూడా తీయించారట. అలా చిరంజీవి ప్రోత్సాహంతో హీరోయిన్ అవ్వాలని నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాని పేర్కొంది.

పాటలో తన పొజిషన్ మార్చాల్సి వచ్చిందని, అయితే ఒక్కసారిగా మనిషా అటు వెళ్లు అని అన్నాడని తెలిపింది. మనీషా ఎవరని అక్కడి వారంత ప్రశ్నిస్తే, మణి చందనను తాము మనీషా అనే పిలిచేవాళ్లమని నాటి విషయాలను చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఆమె మాకు ఎంతో సాయం చేసిందని, వాళ్ల అమ్మ కూడా ఎంతో బాగా చూసుకునేదని ప్రతీ ఒక్క విషయాన్ని చెప్పుకొచ్చాడట.అప్పటి విషయాలన్నీ గుర్తు పెట్టుకున్నాడని, శేఖర్ మాస్టర్ ఏం మారలేదని, అలానే ఉన్నాడని మణి చందన చెప్పుకొచ్చింది. శేఖర్ మాస్టర్ చాలా గొప్పొడు అని అందుకే ఎంత స్టార్డమ్ వచ్చినా అప్పటివి గుర్తుపెట్టుకున్నాడని ఎమోషనల్ అయింది.

For All Tech Queries Please Click Here..!