భారీగా తగ్గిన పెట్రోల్, డీజల్ ధరలు

Thursday, December 6, 2018 09:46 AM Business
భారీగా తగ్గిన పెట్రోల్, డీజల్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలకు అనుగుణంగా రోజూ వారీ ఇంధన ధరల సవరణ ప్రకారం దేశీయ ఆయిల్ మార్కెట్ కంపెనీలు మరోసారి ఇంధన ధరలను సవరించాయి. దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం (డిసెంబరు 6) భారీగా తగ్గాయి. ఎప్పుడూ 20 పైసలలోపు మాత్రమే తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు నేడు ఏకంగా 40 పైసలు మేర తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 40 పైసలు తగ్గి రూ.71.32కి చేరుకోగా.. డీజిల్ ధర 43 పైసలు తగ్గి రూ.65.96 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోలు ధర 39 పైసలు తగ్గి రూ.76.90 ఉండగా.. డీజిల్ ధర 46 పైసలు తగ్గి రూ.69.02 కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌ ధర‌ 61.30 డాలర్లు మరియు డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 52.55 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

తెలుగు రాష్ట్రాల్లోని హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర 40 పైసలు తగ్గి రూ.75.61 మరియు డీజిల్ ధర 47 పైసలు తగ్గి రూ.71.65 కు చేరుకున్నాయి. విజయవాడలో పెట్రోల్‌ ధర 40 పైసలు తగ్గి రూ.75.09 ఉండగా.. డీజిల్‌ ధర 45 పైసలు తగ్గి రూ.70.73 గా ఉంది.

For All Tech Queries Please Click Here..!