రాష్ట్రంలో నేటి వాతావరణం ఇలా..
_(31)-1747360407.jpeg)
తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ అయిన జూన్ 4 కంటే నాలుగు నుంచి ఐదు రోజుల ముందే ప్రవేశించే అవకాశాలున్నాయని ఐఎండీ తాజా అంచనాల్లో వెల్లడించింది. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కన్యాకుమారి సహా దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలో రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపింది.