వాతావరణం: రాష్ట్రంలో ద్రోణి ప్రభావం
Saturday, June 7, 2025 06:36 AM Weather
దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శనివారం విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40- 41°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
