నేడు, రేపు మోస్తరు నుండి భారీ వర్షాలు
Saturday, April 5, 2025 08:00 AM Weather
ఏపిలో నేడు, రేపు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. శనివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. శుక్రవారం అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసినట్లు ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



