అప్రమత్తంగా ఉండండి.. ప్రభుత్వం హెచ్చరిక

Monday, July 21, 2025 07:04 AM Weather
అప్రమత్తంగా ఉండండి.. ప్రభుత్వం హెచ్చరిక

రానున్న రెండు రోజుల వరకు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, మిగతా ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. గంటకు 40–50కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీసే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ సహా పలు జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ ప్రటించారు.

ఏపిలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచించారు. చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. రేపు విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: