అలెర్ట్: నేడు ఈ మండలాల ప్రజలు జాగ్రత్త
_(6)-1742404899.jpeg)
రాష్ట్రంలోని 59 మండలాల్లో ఈ రోజు (గురువారం) వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిటీ (APSDMA) తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 20, మన్యం జిల్లాలో 14, అల్లూరి జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా అట్లూరులో 41.2 డిగ్రీలు, ప్రకాశం జిల్లా గోళ్లవిడిపిలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజలు వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా చూసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా ORS, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచించింది.