మూడు రోజులు జాగ్రత్తగా ఉండండి.. ప్రభుత్వం హెచ్చరిక
Friday, March 14, 2025 09:00 AM Weather
_(6)-1741918553.jpeg)
ఏపీలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ (APSDMA) తెలిపింది. ఈ నెల 16 వరకు కోస్తాలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.
కాగా గురువారం ప్రకాశం జిల్లాలోని పెద్ద దోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాబట్టి ఈ మూడు రోజులు అనవసరంగా బయట తిరగకుండా జాగ్రత్తగా ఇంట్లో ఉండటం మంచిది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: