గిబ్లీ ట్రెండ్..ఈ ఫొటోస్ ఎంత ప్రమాదమో తెలుసా..?
Thursday, April 3, 2025 09:00 AM Technology

ప్రస్తుతం సోషల్ మీడియాలో గిబ్లీ ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. మీ ఫోటో చాట్ జీపీటీ ఏఐకి ఇస్తే అది దాన్ని కాటూన్‌లా మార్చి అందిస్తుంది. దీంతో నెటిజన్లు వారి ఫొటోస్‌తోపాటు ఫ్యామిలీ ఫొటోస్ కూడా గిబ్లీ ఇమేజ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌లో ఎక్కడ చూసినా ఈ ఫొటోసే. ఘిబ్లీ ఇమేజ్ కోసం మీ ఫొటోస్ ఏఐలో అప్లోడ్ చేయడం చాలా ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఘిబ్లీ ఫొటోస్ క్రియేట్ చేసుకోవడం అంటే మీ వేలుతో మీ కంట్లో పొడుచుకున్నట్లే అని సైబర్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. 'మనం ఇష్టపూర్వకంగానే ఫోటోలు అప్‌లోడ్ చేస్తాం కాబట్టి యాప్స్ ముఖ కవళికలను భద్రపరుచుకుంటాయి. దీని వల్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు కచ్చితంగా భంగం వాటిల్లుతుంది' అని చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: