ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్ మ్యాచ్ లో అదే కీలకం
Saturday, March 8, 2025 12:57 PM Sports

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా-న్యూజిలాండ్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కి టాస్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ తుది పోరుకు భారత్-పాకిస్థాన్ ఆడిన పిచ్ నే క్యూరేటర్లు సిద్ధం చేశారు.
స్లో, స్లగ్గిష్ పిచ్ కావడంతో రెండో ఇన్నింగ్స్ ఛేదనకు కష్టంగా మారనున్నట్లు పలువురు సీనియర్ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. దీంతో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో ఇండియా 244 లక్ష్యాన్ని అతికష్టం మీద ఛేదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫైనల్ లో తొలుత ఇండియా బ్యాటింగ్ చేస్తే విజయావకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: