ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్ తో ఫైనల్ ఆడే జట్టు ఇదే..
Wednesday, March 5, 2025 10:44 PM Sports
_(11)-1741194833.jpeg)
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో ఫైనల్ ఆడే జట్టు ఏదో తేలిపోయింది. మిల్లర్ సెంచరీతో అద్భుత పోరాటం చేసినా సెమీఫైనల్-2లో న్యూజిలాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ నెల 9న జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 362 పరుగులు చేసింది. 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా ఒత్తిడిని జయించలేక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివర్లో మిల్లర్ (100) 4 సిక్సులు, 10 ఫోర్లతో విధ్వంసం సృష్టించినా ఫలితం లేకపోయింది. దీంతో న్యూజిలాండ్ ఫైనల్ కు చేరింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: