ఇంగ్లండ్ పై భారత్ విజయం.. సిరీస్ కైవసం
Saturday, February 1, 2025 03:10 PM Sports
_(20)-1738402798.jpeg)
T20 సిరీస్ లో నాలుగో మ్యాచులో ఇంగ్లండ్ పై భారత్ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. నాలుగో T20లో 15 పరుగుల తేడాతో భారత్ గెలిచి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఒక దశలో గెలిచేలా కనిపించినా 15వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి 2వికెట్లు తీసి మ్యాచ్ను ఓ మలుపు తిప్పారు.
దూబేకు కంకషన్ సన్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. రవి బిష్ణోయ్ కూడా 3 వికెట్లు తీసి రాణించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(51) హాఫ్ సెంచరీ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: