ఛాంపియన్ అయ్యేదెవరు..?
Sunday, March 9, 2025 08:27 AM Sports
_(14)-1741489013.jpeg)
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ - న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ తుది పోరు ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీలో భారత్ జట్టు ఇప్పటికే వరుస విజయాలతో జోరు మీదుంది. ప్లేయర్లంతా ఫామ్ లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం ఇండియాకు కలిసొచ్చే అంశాలుగా చూసుకోవచ్చు.
అయితే ICC ఈవెంట్లలో భారత్ పై న్యూజిలాండ్ దే పైచేయి కావడం కాస్త కలవరపెడుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లలో చూడొచ్చు. గతంలో ఆదివారం జరిగిన పలు ఫైనల్స్ లో భారత్ ఓటమిని చవిచూసింది. ఈ రోజు మ్యాచ్ లో ఆ సెంటిమెంట్ ను పక్కకు నెట్టి ఇండియా ఛాంపియన్ గా నిలవాలని కోరుకుందాం..
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: