ఛాంపియన్స్ ట్రోఫీ: నేడే తొలి సెమీస్.. పోరుకు భారత్, ఆస్ట్రేలియా సిద్ధం
Tuesday, March 4, 2025 12:38 PM Sports
_(1)-1741072095.jpeg)
దుబాయ్ వేదికగా తొలి సెమీస్ మ్యాచ్ నేడు భారత్-ఆసీస్ మధ్య జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమౌతుంది. ఇప్పటికే దుబాయ్ పిచ్ అడ్వాంటేజ్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. నాలుగు పిచ్‌ల్లో దేనిని వాడుతారనేది తమకు తెలియదని తమకూ కొత్తదే అవుతుందని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ భారత్‌ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో వారికి అడ్వాంటేజ్ అంటూనే ఒత్తిడీ ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. అలాగే కోచ్ గౌతమ్ గంబీర్ సామర్థ్యాలకు కఠిన పరీక్షేనని వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్లో గెలిసిన జట్టు ఫైనల్ లో ఆడనుంది. రేపు రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈనెల 9న ఛాంపియనస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: