భారత్ పర్యటనకు ఫుట్ బాల్ స్టార్ మెస్సీ
Friday, August 1, 2025 04:30 PM Sports
అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోనిల్ మెస్సీ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు మెస్సి షెడ్యూల్ ఖరారు అయినట్లు కథనాలు వస్తున్నాయి. డిసెంబర్ 13 నుండి 15 వరకు మెస్సి భారత్ లో పర్యటించనున్నారు. ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో అభిమానులను కలువనున్నట్లు సమాచారం.
ప్రమోషనల్ టూర్ లో భాగంగా మెస్సి రానున్నాడు. గత 14 ఏళ్లలో మెస్సి భారత్ కి రావడం ఇది రెండోసారి. వాంఖడే స్టేడియంలో దిగ్గజ క్రికెటర్లతో మ్యాచ్ ఆడే అవకాశం ఉందని సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



