పులివెందుల ఉప ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం
Wednesday, August 13, 2025 09:06 AM Politics
పులివెందుల ఉప ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు కేంద్రాల్లో రీ పోలింగ్ అంటూ ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్య తీసుకుందని వైసిపి ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. తాము 15 చోట్ల కోరితే 2 చోట్ల రీ పోలింగ్ చేపట్టారని, దీన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు.
కోర్టుకు ఏదో కారణం చెప్పడానికే రీ పోలింగ్ చేపట్టిందని, ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగ ఓట్లు వేశారని తెలిపారు. ఇలాంటి ఎన్నిక ఎక్కడా జరిగి ఉండదన్నారు. పులివెందులలో బాబు కొత్త సంస్కృతి తీసుకొచ్చారని విమర్శించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



