నందమూరి కుటుంబంతో విజయ్ సాయి రెడ్డి

వైసిపికి ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యే అవకాశాలను కొట్టి పారేయలేమని ఇంకొందరు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆయన రాజకీయ నాయకులు ఎవరితోనూ కనిపించడం లేదు. అయితే నందమూరి కుటుంబానికి దగ్గరగా ఉన్నారు.
నందమూరి కుటుంబ సభ్యుడు దివంగత కథానాయకుడు, తారక రత్న భార్య అలేఖ్య విజయసాయి రెడ్డితో పాటు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'వీకెండ్ విత్ విఎస్ఆర్' అని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చినా రాకున్నా ఆయన కుమార్తె మాత్రం బీజేపీలో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
నందమూరి కుటుంబానికి కోడలు కాకముందు నుంచి విజయసాయి రెడ్డితో అలేఖ్యకు బంధుత్వం ఉంది. ఆమెకు ఆయన బాబాయ్ వరుస అవుతారు. తారకరత్న, అలేఖ్య వివాహానికి అప్పట్లో ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే విజయసాయి రెడ్డి తమకు మద్దతు ఇచ్చారని అలేఖ్య గతంలో తెలిపారు.