ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు.. స్పందించిన టీడీపీ
Wednesday, March 19, 2025 09:30 AM Politics
_(9)-1742350654.jpeg)
దేశంలోని ఎమ్మెల్యేల్లో టీడీపీ ఎమ్మెల్యేలపైనే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయని ADR నివేదిక పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ స్పందించింది. "ఐదేళ్ల మీ రాక్షస పాలనపై పోరాటం చేసినందుకు పెట్టిన అక్రమ కేసులే కదా జగన్ ఇవి. మీ ఆటవిక పాలనలో సొంత చెల్లి, తల్లి మీద కూడా కేసులు పెట్టిన విషయం మర్చిపోయారా?" అని టీడీపీ ట్వీట్ చేసింది.
క్రిమినల్ చేత నడిచే పార్టీకి అందరూ క్రిమినల్స్ లాగే కనిపిస్తారు మరి అని పేర్కొంది. టీడీపీ ఎమ్మెల్యేలలో 115 మందిపై క్రిమినల్ కేసులున్నాయని వైసిపి చేసిన పోస్టుపైనా టీడీపీ మండిపడింది. ఈ కేసులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన వీడియోను షేర్ చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: