బీజేపీ షరతులు, సీట్లకు చంద్రబాబు ఓకే - ముహూర్తం ఫిక్స్..!?

Thursday, February 29, 2024 01:54 PM Politics
బీజేపీ షరతులు, సీట్లకు చంద్రబాబు ఓకే - ముహూర్తం ఫిక్స్..!?

బీజేపీ కోరినట్లుగా సీట్లు, ప్రభుత్వంలో భాగస్వామ్యం పైన చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ కోరుతున్న 8 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమయ్యారని తెలుస్తోంది. 12-15 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించనున్నట్లు చెబుతున్నారు. బీజేపీ కోరిన విధంగా విశాఖ, రాజమహేంద్రవరం, నర్సాపురం, విశాఖ, ఏలూరు, తిరుపతి, రాజంపేట, హిందూపురం ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ స్థానాల్లో విశాఖ నార్త్, తాడేపల్లిగూడెం, కైకలూరు, గుంటూరు పశ్చిమం, జమ్మలమడుగు, ధర్మవరం, రాజమండ్రి సిటీ, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఒక స్థానం ఇచ్చేందుకు ప్రాధమికంగా నిర్ణయం జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ స్థానాల్లో స్థానిక నాయకత్వంతో చర్చలతో సర్దబాట్లు జరగనున్నాయి. ఎంపీ స్థానాల విషయంలో మాత్రం బీజేపీ కేంద్రం నాయకత్వం పట్టుబట్టటంతో చంద్రబాబు ఆమోదం తెలిపారని సమాచారం.

మార్చి 5న టీడీపీ అధికారికంగా ఎన్డీఏ లో చేరటానికి ముహూర్తంగా నిర్ణయించారని తెలుస్తోంది. మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో..తొలి వారంలోనే ఎన్డీఏలో చేరిక...సీట్ల పైన ప్రకటన చేయటం ద్వారా ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రకటించిన సీట్లలోనూ స్వల్ప మార్పులు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. 8 ఎంపీ సీట్లు..అందునా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను బీజేపీకి కేటాయిస్తున్నారనే సమాచారంలో టీడీపీ సీనియర్లలో టెన్షన్ మొదలైంది. బీజేపీ 4-5 సీట్ల వరకే కేటాయించే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావించారు. ఇక, బీజేపీకి సీట్ల కేటాయింపు..ఎన్డీఏలో చేరిక పైన ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

For All Tech Queries Please Click Here..!
Topics: