విజయసాయి రెడ్డి రాజీనామాకు అసలు కారణం ఇదేనా
_(15)-1737783348.jpeg)
వైసీపీకి ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. హఠాత్తుగా ఆయన ఎందుకు రాజీనామా చేశారన్నది రాజకీయవర్గాలకు సైతం అంతుచిక్కడం లేదు.
విజయసాయిరెడ్డి ఇటీవల కాకినాడ పోర్టు కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయసాయిరెడ్డికి సన్నిహితమైన ఆడిటింగ్ కంపెనీని రంగంలోకి దింపి.. వెయ్యి కోట్లు అవకతవకలకు పాల్పడినట్లుగా మొదట నివేదిక ఇప్పించారు. ఆ నివేదిక చూపించి బెదిరించి పోర్టులో వాటాలను రాయించుకున్నారు. తర్వాత నివేదిక మార్పించి తక్కువ జరిమానా వేశారు. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోర్టును లాగేసుకున్నట్లుగా స్పష్టంగా ఉందని టీడీపీ నేతలంటున్నారు. సీఐడీతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. పోర్టు రాయించుకుంది విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీ. ఈ కేసులు చుట్టుముడుతూండటంతో ఆయన ఆందోళన చెందారని భావిస్తున్నారు. చంద్రబాబుతో రాజకీయంగానే విబేధించానని ఆయన చెప్పారు. పవన్ తో స్నేహం ఉందన్నారు. ఈ మాటల్ని బట్టి చూస్తే.. ఇక తన జోలికి రావొద్దని తాను అన్నీ వదిలేశానని చెప్పినట్లుగా ఉందని పలువురు అంటున్నారు.