మిథున్ రెడ్డి అరెస్టుపై స్పందించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Sunday, July 20, 2025 04:15 PM Politics
మిథున్ రెడ్డి అరెస్టుపై స్పందించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం ఆయనను పోలీసులు అరెస్టు చేయగా ఈ రోజు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.

మిథున్ రెడ్డి అరెస్టుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో అన్ని చూస్తున్నామని, కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: