పవన్ కళ్యాణ్ బాడీ షేమింగ్...

మంగళవారం సాయంత్రం మహా కుంభమేళాకు పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా దంపతులు హాజరై పుణ్య స్నానం చేసిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పుణ్యస్నానం ఆచరించినప్పుడు చొక్కా తొలగించి కనిపించారు పవన్. దీంతో ఆయన ఫిట్ నెస్ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
కొందరు ఆయన పొట్టపై కామెంట్స్ పెడుతున్నారు. ఫిట్ నెస్ లేదని అంటున్నారు. అదే సమయంలో పవన్ ఫ్యాన్స్ వారికి కౌంటర్లు ఇస్తున్నారు. ప్రజా ప్రతినిధితోపాటు సెలబ్రిటీ అయినప్పటికీ చొక్కా విప్పడానికి వెనుకాడలేదని చెబుతున్నారు. అనేక ఏళ్లుగా ఆయన ప్రజా సేవలో పాల్గొంటున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారని అంటున్నారు. సక్రమంగా లేని ఆహార సమయాలు, నిద్ర షెడ్యూల్, ఒత్తిడి ఆయన శరీరాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు. అది అంతా అర్థం చేసుకోవాలని, అంతేగానీ అనవసరమైన చర్చ తగదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో బాడీ షేమింగ్ సరైన పని కాదని సూచిస్తున్నారు. ఆయన కేవలం సినిమా నటుడు కాదని, బిజీగా ఉండే రాజకీయ నాయకుడని అన్నారు. ఆయనకు మిగతా హీరోల్లా ఫిట్ నెస్ మెయింటైన్ చేయడానికి తగినంత సమయం లేదని చెబుతున్నారు. కాబట్టి పవన్ విషయంలో బాడీ షేమింగ్ కామెంట్స్ చేయొద్దని చెబుతున్నారు.