అమిత్ షా వ్యాఖ్యలకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కౌంటర్
Sunday, August 24, 2025 11:00 AM Politics
సల్వా జుడుం కేసులో తాను ఇచ్చిన తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ తీర్పు తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశంలో రాజ్యాంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ప్రజాస్వామ్యంలో లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



