ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై అప్పుడో మాట ఇప్పుడో మాట, వీడియో ఇదిగో

మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే.. కండక్టర్ టికెట్ డబ్బు అడిగితే నా పేరు చెప్పండి చాలంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పిన సంగతి విదితమే. రాష్ట్రంలో ఏ ఊరికి కావాలన్నా ఫ్రీగా మహిళలు వెళ్లొచ్చంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చరు. ఇప్పుడు మాత్రం కేవలం జిల్లా వరకే ఫ్రీ అంటూ ప్లేట్ ఫిరాయించింది కూటమి ప్రభుత్వం. అక్కచెల్లెమ్మలని నమ్మించి మరీ ఇంతలా మోసం చేస్తావా అంటూ మండిపడుతున్నారు ఏపీ ప్రజలు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కచ్చితంగా ఉంటుందని, అయితే, ఒక జిల్లా వారు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ విషయంపై స్పష్టత నిస్తున్నట్టు పేర్కొన్నారు.