అన్నంత పని చేశాడు: కొత్త పార్టీ పెట్టిన ఎలాన్ మాస్క్
Sunday, July 6, 2025 10:30 AM Politics
కొత్త రాజకీయ పార్టీ పెడుతూ టెస్లా ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'అమెరికా పార్టీ' పేరుతో మస్క్ కొత్త పార్టీని స్థాపించారు. కాగా, ఇటీవల అమెరికా కాంగ్రెస్లో పాస్ అయిన "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్"పై అసంతృప్తి వ్యక్తం చేసిన మస్క్.. ఈ బిల్ చట్టంగా మారితే కొత్త పార్టీ పెడతానని తెలిపిన సంగతి తెలిసిందే.
మస్క్ పార్టీ లాంచ్‌కు సంబంధించి కార్యాచరణ ఇదివరకే మొదలైనట్లు అమెరికన్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ మిత్రులు, స్వతంత్ర అభ్యర్థులు, కొత్త తరం ఓటర్లను ఆకర్షించేలా మస్క్ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల్లో రిపబ్లికన్, డెమొక్రాట్ అభ్యర్థుల మీద ప్రభావం చూపించేలా మస్క్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



