జగన్ చేసిన అప్పులు రూ. 14 లక్షల కోట్లు కాదు, రూ. 3 లక్షల కోట్లు మాత్రమే

Friday, March 7, 2025 02:14 PM Politics
జగన్ చేసిన అప్పులు రూ. 14 లక్షల కోట్లు కాదు, రూ. 3 లక్షల కోట్లు మాత్రమే

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో అప్పులు ఏకంగా రూ.14 లక్షల కోట్లంటూ ప్రచారం మొదలుపెట్టిన కూటమి సర్కారు.. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ. 5,19,192 కోట్లు మాత్రమేనని ప్రకటించింది. గత రెండు ప్రభుత్వాల అప్పులపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు.. ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.

2014 జూన్‌ 2 వ తేదీ నుంచి.. అంటే 2014-15 నుంచి  2023-24..  జూన్ 12వ తేదీ దాకా.. అలాగే 2024 డిసెంబర్ 31వ తేదీ దాకా ప్రభుత్వం, ప్రభుత్వ రంగల సంస్థల రుణాల వివరాలు తెలియజేయాలని ‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌, తాటిపర్తి చంద్రశేఖర్‌, ఆకేపాటి అమర్నాథ్‌, మత్స్యరస విశ్వేశ్వరరాజులు ఆర్థిక మంత్రి పయ్యావులను కోరారు.

దీనిపై పయ్యావుల కేశవ్ సమాధానిమిస్తూ.. పబ్లిక్ అప్పులు రూ.2,34,225 కోట్లు. కార్పొరేషన్లు ద్వారా చేసిన అప్పులు  రూ. 1,05, 355 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ తెలిపింది.మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే. అలాగే గత ప్రభుత్వం(వైఎస్సార్‌సీపీ) దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని పేర్కొంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: