నన్ను చంపాలని చూస్తున్నారు: బోరుగడ్డ అనిల్ సెల్ఫీ వీడియో
Sunday, March 9, 2025 03:12 PM Politics

తనను చంపాలని చూస్తున్నారని బోరుగడ్డ అనిల్ సంచలన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనకు బెయిల్ రాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
నాకు, నా కుటుంబానికి ఏమైనా కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అంటూ వీడియోలో పేర్కొన్నారు. చెన్నైలో తన తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని, తన కన్నతల్లికి తన అవసరం ఉందని చెప్పారు. "నాకు అన్న, అన్ని జగన్ మోహన్‌రెడ్డినే. వైసీపీ పార్టీనే నాకు పెద్దిళ్లు" అంటూ తెలిపారు. కోర్టు తనను కాపాడాలని కోరాడు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత బోరుగడ్డ అనిల్ పరారీలో ఉన్నాడని ఎల్లో మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే బోరుగడ్డ అనిల్ సెల్పీ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: