బిజెపి నేతకు కానుకగా ఫుట్ బాల్ పంపిన సొంత పార్టీ ఎంపీ
Tuesday, August 26, 2025 06:39 PM Politics
తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న రీతిలో తన నిరసనను వ్యక్తం చేశారు. బిజేపి నేత చంద్రశేఖర్ తివారికి కానుకగా ఫుట్ బాల్ ఇచ్చి నిరసన తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ పార్టీలో కొందరు నేతల వ్యవహార శైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తనను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు.
చంద్రశేఖర్ తివారిని కలిస్తే రామచందర్ రావును, రామచందర్ రావుని కలిస్తే అభయ్ పాటిల్ కలవమంటున్నారని, ఒకరిని కలిస్తే మరొకరి పేరు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



