రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారంటే..
Friday, June 20, 2025 04:14 PM Offbeat
ప్రపంచ దేశాలు శనివారం (జూన్ 21) యోగా దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధమయ్యాయి. మన దేశంలో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015లో జరుపుకున్నారు. దీనిని భారత ప్రధాని మోడీ సెప్టెంబర్ 27, 2014న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తన ప్రసంగంలో ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనను డిసెంబర్ 11, 2014న ఆమోదించారు. ఈ మేరకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. సంవత్సరం మొత్తంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజు జూన్ 21. కాబట్టి ఆ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)