కాకినాడ బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో భారీ పేలుడు
Monday, March 3, 2025 12:38 PM Offbeat
ఏపీలోని కాకినాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాలాజీ ఎక్స్‌పోర్ట్స్ వద్ద హమాలీలు క్రాకర్స్ లోడ్ దింపుతుండగా భారీ పేలుడు చోటు చేసుకుంది.స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో పార్సిల్ దింపుతుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో హమాలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
