పాఠశాలలో పుష్ప క్రేజ్.. తలలు పట్టుకుంటున్న హెడ్ మాస్టర్

Monday, February 24, 2025 12:00 PM News
పాఠశాలలో పుష్ప క్రేజ్.. తలలు పట్టుకుంటున్న హెడ్ మాస్టర్

పాఠశాలలో పుష్ప క్రేజ్ తో సిబ్బందికి తలనొప్పిగా మారింది. యూసఫ్ గూడ లోని ఒక స్కూల్ లో స్టూడెంట్స్ అందరూ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ స్టైలింగ్ ని అనుసరిస్తూ పెద్ద తలనొప్పిగా మారారని, అసలు ఇలాంటి సినిమాలను సెన్సార్ బోర్డు వారు ఎలా అంగీకరిస్తున్నారని, ప్రభుత్వాలు ఎలా విడుదల చేయడానికి ఒప్పుకుంటున్నారని స్కూల్ హెడ్ మాస్టర్ రీసెంట్ గా జరిగిన ఒక డిబేట్ లో చెప్పుకొచ్చారు.

మా స్కూల్ లో సగానికి పైగా స్టూడెంట్స్ మాట్లాడే తీరు మారిపోయింది, వాళ్ళ ప్రవర్తనలో చాలా తేడా వచ్చేసింది, యాంటీ హీరోలను రోల్ మోడల్ గా తీసుకుంటే పిల్లలు చెడిపోతారని, తక్షణమే ఇలాంటి సినిమాలను సెన్సార్ బోర్డు భవిష్యత్తులో బ్యాన్ చేయకపోతే పిల్లలు బాగా చెడిపోతారని హెడ్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు తమ హీరో ఏ రేంజ్ లో నటించకపోతే ఆ పిల్లలు అంతలా కనెక్ట్ అవుతారు?, స్కూల్ పిల్లల్లో అల్లు అర్జున్ కి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ఎవరికీ లేదంటూ చెప్పుకొచ్చారు.

మరికొంతమంది అయితే అల్లు అర్జున్ ని ట్యాగ్ చేసి రోల్ మోడల్ గా నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు, ఇలాంటి అసాంఘిక సినిమాలు తీసి చెడగొట్టేస్తున్నావు, భవిష్యత్తులో అయినా ఇలాంటి సినిమాలు చేయడం ఆపేయ్ అంటూ నిలదీస్తున్నారు. ఏది ఏమైనా ‘పుష్ప’ అనే క్యారక్టర్ ఒక సంచలనం, దేశం లో అత్యధిక శాతం మంది జనాలు ఈ సినిమాలోని మ్యానరిజమ్స్ ని యాటిట్యూడ్ ని అనుసరిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: