Breaking: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
Saturday, July 19, 2025 08:53 PM News
ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఆయన ఈ కేసులో ఏ4గా ఉన్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
ఈ రోజు మిథున్ రెడ్డి విజయవాడలో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు మిథున్ రెడ్డినీ విచారించిన సిట్ అధికారులు అనంతరం ఆయనను అరెస్టు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



