దారుణం: మగాళ్లకు భద్రత లేకుండా పోతోందా..?

సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను చూసుకుంటే జంబలకడి పంబలోని మొదటి దశ వచ్చేసినట్లు కనిపిస్తోంది. స్త్రీ, పురుషుల లక్షణాలు కొద్ది కొద్దిగా మారుతూ ఉన్నాయి. భర్తలను చంపుకుతింటున్న భార్యల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, మధ్య ప్రదేశ్‌లొ సగటు మగాడు భయపడిపోయే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్తను అత్యంత రాక్షసంగా చితక్కొట్టింది. గొడ్డును బాదినట్లు భర్తను బాదింది.
వివరాల్లోకి వెళితే మధ్య ప్రదేశ్లోని పన్నాకు చెందిన లోకేష్‌కు అదే ప్రాంతానికి చెందిన హర్షితతో 2023లో పెళ్లయింది. హర్షిత పేద కుటుంబానికి చెందిన అమ్మాయి కావటంతో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొన్ని నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాత నుంచి అతడికి వేధింపులు మొదలయ్యాయి. బంగారం, డబ్బు కావాలంటూ భార్య, అత్త, బావమరిది లోకేష్‌ను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టింది. శారీరకంగా, మానసికంగా అతడ్ని వేధించేది. రోజు రోజుకు టార్చర్ పెరుగుతూ పోయింది. దీంతో లోకేష్ ఓ ప్లాన్ వేశాడు. ఆమెకు తెలియకుండా గదిలో సీక్రెట్ కెమెరా అమర్చాడు.
కొద్దిరోజుల క్రితం భార్య అతడితో గొడవ పెట్టుకుంది. లోకేష్‌ను కింద కూర్చోబెట్టి అతడి రెండు చెంపలు వాయించింది. దెబ్బలు భరించలేక అతడు చేతులెత్తి వారిని ప్రథేయపడ్డాడు. అయినా ఆమె కనికరించలేదు. ఈసారి అతడి మీద కూర్చుని చెంపలు వాయించింది. ముఖంపై కాలితో బలంగా తన్నింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. అతడు ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. భార్య తనను చిత్ర హింసలు పెడుతోందని, పోలీసులు తనను కాపాడాలని వేడుకున్నాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.