వివేక హత్య కేసు: అప్రూవర్ దస్తగిరి భార్యపై దాడి

Sunday, March 16, 2025 10:38 PM News
వివేక హత్య కేసు: అప్రూవర్ దస్తగిరి భార్యపై దాడి

మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా దస్తగిరి భార్యపై దాడి జరిగింది. కడప జిల్లా తొండూరు మండలం మల్లేలలో తనపై దాడి జరిగినట్లు దస్తగిరి భార్య షబానా ఓ వీడియో విడుదల చేశారు. శంషున్, పర్వీన్ అనే ఇద్దరు మహిళలు తనపై దాడి చేసినట్లు పేర్కొన్నారు.

ఏడాదిలోపు తన భర్తను నరికేస్తామని బెదిరించినట్లు చెప్పారు. నిన్న సాయంత్రం ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. వివేకా హత్య కేసులో జగన్, అవినాశ్ పై దస్తగిరి అబద్ధపు సాక్షం చెప్పారని ఆ మహిళలు తనతో అన్నట్లు షబానా తెలిపారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: