కొట్టుకపోయిన రైల్వే ట్రాక్.. నిలిచిన రైళ్ల రాకపోకలు
Wednesday, August 27, 2025 02:37 PM News
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్- కామారెడ్డి మధ్య పలు రైలు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా తలమట్ట దగ్గర వరద ప్రవాహం పెరగడంతో రైల్వే ట్రాక్ కింద ఉన్న కంకర మొత్తం కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో 12 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను సూచించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



