ఉచిత గ్యాస్ తీసుకునేందుకు అదే లాస్ట్ డేట్
Thursday, March 13, 2025 10:59 AM News
_(23)-1741843745.jpeg)
ఏపీలో 'దీపం-2' పథకం కింద కూటమి ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకోనివారు ఈ నెలఖారులోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు.
లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి తరువాతి సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: