సినిమా పైరసీకి చెక్ పెట్టిన ఏపీ కుర్రాడు.. నూతన ఆవిష్కరణ

Sunday, February 16, 2025 08:05 AM News
సినిమా పైరసీకి చెక్ పెట్టిన ఏపీ కుర్రాడు.. నూతన ఆవిష్కరణ

తెలుగు కుర్రాడు తన నూతన ఆవిష్కరణతో సినిమా పైరసీకి చెక్ పెట్టాడు. అనకాపల్లికి చెందిన యువ ఇంజినీర్ వినోద్ కుమార్ 'పైరసీ సెక్యూర్డ్ బోర్డ్' కనిపెట్టి సరికొత్త పరిష్కారానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడున్న వాటర్ మార్క్ విధానానికి మించి ఈ టెక్నాలజీ అత్యాధునికమైనదని చెబుతున్నారు.

పైరసీ అడ్డుకునే క్రమంలో అమెరికా, జపాన్ వంటి దేశాలు తీసుకొచ్చిన పద్ధతులతో పోటీపడి వినోద్ కుమార్ కనిపెట్టిన టెక్నాలజీ పేటెంట్ హక్కులు దక్కించుకోవడం విశేషం. సాఫ్ట్ వేర్ టెక్నాలజీతో కాకుండా హార్డ్ వేర్ పద్ధతుల్లో వినోద్ కుమార్ పైరసీని అడ్డుకునే టెక్నాలజీ తీసుకొచ్చారు. దీంతో ప్రతి ధియేటర్లో ఈ టెక్నాలజీని అమర్చుకుంటే సెల్ ఫోన్ నుంచి ఎటువంటి అత్యాధునిక కెమెరా నుంచి కాపీ చేసినా చుట్టుపక్కల శబ్దాలు, తెల్లటి తెర తప్పితే సినిమా రికార్డ్ కావడం అసాధ్యమని చెప్తున్నారు. వినోద్ తీసుకొచ్చిన టెక్నాలజీని వివిధ దశల్లో పరీక్షలు జరిపిన అమెరికాలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ 'బెల్ కామ్ టెక్నాలజీ' ఈ అధునాతన టెక్నాలజీని త్వరలో ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిని అన్నిదశల్లోనూ పరిక్షలు జరిపామని, ఇదొక అద్భుతమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పవన్ కల్యాణ్ పంజా సినిమాకు పనిచేసిన అనుభవం ఉన్న వినోద్ కుమార్ దాదాపు 8ఏళ్లు కష్టపడి ఈ టెక్నాలజీకి రూపకల్పన చేశారు. ఈ టెక్నాలజీ అమర్చుకునేందుకు ధియేటర్లలో తెర ముందు, తెర వెనుక ఏర్పాట్లు చేస్తే సరిపోతుందని, మరి ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: